Site icon NTV Telugu

Bandi Sanjay : నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితం

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ కుమార్ పేరును జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితమన్నారు బండి సంజయ్‌. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా తనని ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన.. కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండని, కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి చేస్తానన్నారు. కరీంనగర్ ప్రజలు తలెత్తుకు తిరిగేలా పనిచేస్తానన్నారు బండి సంజయ్‌. అంతేకాకుండా.. జమ్మికుంటలో అడుగుపెట్టగానే ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

 
BJP: తొలి జాబితాలో ఉన్న బీజేపీ టాప్ లీడర్లు వీరే.. పోటీ చేస్తున్న స్థానాలు ఇవే..
 

అయితే.. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, రాజీవ్ చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింథియా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి ప్రముఖ నేతలు తొలి లిస్టులోనే ఉన్నారు.

Paripoornananda Swami: ఎన్నికల బరిలోకి పరిపూర్ణానంద! ఏ నియోజకవర్గం నుంచంటే!

Exit mobile version