Site icon NTV Telugu

Bandi Sanjay : హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు

Bandi Sanjay

Bandi Sanjay

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ భోగి పండుగ భోగ భాగ్యాలను అందించాలని, సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని, కనుమ పండుగ కన్నుల పండుగై మీ ఇంటిలో సుఖసంతోషాలు, ఆనందానురాగాలు పంచాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నానన్నారు. అంతేకాకుండా హిందువుల ఆత్మ గౌరవ ప్రతీక, భారతీయుల 5 శతాబ్దాల నిరీక్షణ అయోధ్య రామ మందిర ప్రతిష్ట అని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఈనెల 22న భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతున్న శుభ సందర్భాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రియతమ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈనెల 22న ప్రతి ఒక్కరూ మీ దగ్గరలోని ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలి. సాయంత్రం ప్రతి ఇంటా ఐదు దీపాలు వెలిగించి వెలుగులు నింపాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ, అయోధ్య రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్.

Exit mobile version