Bandi Sanjay Release Note: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నియోజవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా బండి సంజయ్ సంచలన ప్రకటన ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను సవాలు చేస్తూ బండి అనూహ్యంగా లేఖ విడుదల చేశారు. ‘గంగుల.. నీ సవాల్‌కు నేను రెడీ. భాగ్యలక్ష్మి వద్దకు కేసీఆర్‌ను రమ్మను. కరీంనగర్‌లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధం. డబ్బులు పంచలేదని ప్రమాణం చేస్తా.
Also Read: Telangana: ఓటు వేసేందుకు సొంత ఊర్లకు ప్రజలు.. కిక్కిరిసిపోయిన జూబ్లీ బస్‌స్టాండ్
నువ్వు డబ్బులు పంచలేదని ప్రమాణం చేస్తావా? డబ్బుల పంచలేదని ప్రమాణం చేసే దమ్ము నీకుందా? డబ్బు పంచిన బీఆర్ఎస్ కొత్తపల్లి కార్యకర్తలను చూపిస్తా.. వాళ్లతో ప్రమాణం చేయించే దమ్ము నీకుందా? ఉల్లా చోర్.. కొత్వాల్ కోడంటే బాపతి నీది’ అంటూ గంగులకు సవాల్ విసిరారు. కాగా నిన్న మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర పడటంతో ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి బండి సంజయ్ సరదగా గడిపారు. సాయంత్రం కొడుకు, మేనల్లుడితో సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం గంగులను సవాల్ చేస్తూ లేఖ విడుదల చేశారు. అయితే రేపు ఉదయం 9 గంటలకు బండి సంజయ్ కుటుంబంతో కలిసి ఓటు వేయనున్నాడు.
Also Read: Union Cabinet: రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త.. PMGKAY పొడగింపు..