Site icon NTV Telugu

Bandi Sanjay : మా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేశారు

Bandi 3

Bandi 3

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పాటు పలువురు నేతలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భయపడే మా పార్టీ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌ చేర్చుకుందని ఆరోపించారు.

 

Talasani Srinivas Yadav : ఎనిమిదేళ్లలో బీజేపీ దేశానికి చేసింది ఏమి లేదు

డబ్బు ప్రలోభాలు, కేసుల భయం పెట్టి టీఆర్‌ఎస్‌ చేర్చుకున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలను గల్లీ స్థాయికి దిగజార్చారు కేసీఆర్ పై బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. కేసీఆర్ మా ఫ్లెక్సీలను అడ్డుకున్నంత మాత్రాన మమ్మల్ని అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఒక పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రోటో కాల్ పాటించాలని.. కానీ టీఆర్‌ఎస్‌ సర్కార్ ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన వెల్లడించారు.

 

Exit mobile version