నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజా సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టినం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయించినం. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం. ముద్రా రుణపరిమితిని పెంచినం. రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నం. 75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేసినం. మూలధన వ్యయం కింద మౌలిక సౌకర్యాల కల్పనుకు రూ.11 లక్షల 11 వేల కోట్లు కేటాయించినం. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించినం…ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే.’’అని వివరించారు. మరి కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, 6 గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 9 నెలల మీ పాలనలో నెరవేర్చిన హామీలపై సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ ను క్షమించబోరని అన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మోడీ 100 రోజులపాటు రైతులు, యువత, మహిళలుసహా అన్ని వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Jani Master: జానీ మాస్టర్ పై ముందు సెక్సువల్ హరాస్మెంట్ కంప్లైంట్ రాలేదు.. కానీ?
‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా కనీస మద్దతు ధర పెంపు కోసం 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినం. పీఎం కిసాన్ నిధి ద్వారా 9 కోట్ల 30 లక్షల మంది ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయలు జమ చేసినం. అట్లాగే మహిళల కోసం….‘నారీ శక్తి’ పేఎంఏవై కింద 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినం. 2 లక్షల 35 వేల మంది స్వయం సంఘాలకు చెందిన 26 లక్షల మంది మహిళలను ఆదుకునేందుకు 5 వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలు మంజూరు చేసినం. 4 లక్షల 30 వేల స్వయం సంఘాలకు చెందిన 26 లక్షల మందికి 2 వేల 500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను విడుదల చేసి ప్రయోజనం చేకూర్చినం. ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలకు పెంచినం’’అని వివరించారు.
Delhi: ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
‘‘యువత అభ్యున్నతిలో భాగంగా 4 కోట్ల 10 లక్షల మంది యువతకు లాభం చేకూర్చేందుకు 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించినం. వెయ్యి ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ప్రణాళిక రూపొందించినం.75 వేల కొత్త వైద్య సీట్లు ప్రవేశపెట్టినం.’’అని పేర్కొన్నారు.
అట్లాగే సామాజిక సంక్షేమంలో భాగంగా దేశంలోని 63 వేల ఆదివాసీ, గిరిజన గూడెల్లోని 5 కోట్ల మంది ఎస్టీల ఆర్ధిక స్థితిగతులు మార్చే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించి 6 కోట్ల మందికి లబ్ది చేకూరుస్తున్నట్లు వివరించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు.
మౌలిక వసతులు , కనెక్టివిటీ కోసం..3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులను రూపొందించినట్లు తెలిపారు. 50 వేల 600 కోట్ల రూపాయలతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. న్యాయంపై దృష్టి సారించి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ప్రవేశపెట్టడంతోపాటు పేపర్ లీక్‌లను నివారించేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.