Site icon NTV Telugu

Bandi Sanjay: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బండి సంజయ్..

Bandi Sanjay

Bandi Sanjay

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అంతేకాకుండా.. ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారు. రేపటి ప్రమాణ స్వీకారానికి చాలా మంది వీవీఐపీలు ఇవాళే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. వారికి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: Ammu Abhirami: దర్శకుడితో ప్రేమలో హీరోయిన్.. ఎట్టకేలకు ఓపెన్ అయిపొయింది!

ఇదిలా ఉంటే.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు. ఈరోజు రాత్రికి ఆయన విజయవాడకు చేరుకోనున్నారు. రాత్రి 9:30 కి గన్నవరం ఎయిర్ పోర్టుకు అమిత్ షాతో కలిసి బండి సంజయ్ రానున్నారు. రాత్రి 10:20 కి సీఎం చంద్రబాబుతో అమిత్ షా భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అనంతరం రాత్రికి 11:20 కి నోవోటెల్ కు చేరుకుని బస చేయనున్నారు. రేపు ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని.. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్ళనున్నారు.

Read Also: Terrorist Attack: రియాసి బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు పూంచ్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌ దాడితో సంబంధం..

Exit mobile version