Site icon NTV Telugu

Bandi Sanjay : స్కూల్స్‌లో ఏ సౌకర్యాలు ఉండవు కానీ.. బెల్ట్ షాపులు మాత్రం బోలేడు

Bandi Sanjay

Bandi Sanjay

5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్వార్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోనీ దివ్యాంగులతో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ముచ్చటించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఅర్ బిడ్డకు సీబీఐ నోటీసులు ఇస్తే మనం పోరాటం చేయాలా.. స్కూల్స్ లో ఏ సౌకర్యాలు ఉండవు కాని బెల్ట్ షాపులు మాత్రం బోలేడు ఉన్నాయని ఆయన విమర్శించారు. రోడ్లు సరిగా లేవు.. తెలంగాణలో ఆకలి చావులు పెరిగినవి.. స్వర్ణ కారులు ఆకలి చావులు.. పేదోల్ల ఉసురు ఊరికనే పోతదా అంటూ ఆయన ధ్వజమెత్తారు. కవితను లేదా ఇంకో అక్కను లేదా అన్నను పట్టుకపోతే రోడ్డు ఎక్కవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం వచ్చాక మళ్లీ వస్తానని ఆయన అన్నారు.
Also Read : Jabalpur: డ్రైవర్‎కు హార్ట్ ఎటాక్.. సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదామని, తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్దం కండని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినా ఒరిగిందేమిటి? అని ఆయన ప్రశ్నించారు. డబుల్ ఇండ్లు రాలే… ఆత్మహత్యలు ఆగలే.. ఆకలిచావులున్నయ్ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డకు నోటీసులిస్తే… తెలంగాణ ఎందుకు ధర్నా చేయాలని, వేల కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబం అని ఆయన ఆరోపించారు. 3 నెలలుగా ఆసరా ఫించన్లు ఆగిపోయాయని, ఇప్పటికే 2 నెలల ఫించన్ ను కేసీఆర్ కట్ చేసిండన్నారు. పేదలకు అరిగోస పెడుతున్న నియంత కేసీఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫాంహౌజ్ లో సాగు చేసిన కేసీఆర్ కోటీశ్వరుడు ఎట్లా అయ్యారు? అని, ఆరుగాలం పండించిన రైతులు బికారీలు ఎందుకు అవుతున్నారు? అని ఆయన వ్యాఖ్యానించారు. వడ్ల కొనుగోలు పైసలన్నీ ఇచ్చేది కేంద్రమేనని, వడ్ల సేకరణలో కేసీఆర్ చేసేది బ్రోకరిజమేనని, ఎకరానికి ఎరువుల పేరుతో 30 వేల సబ్సిడీ ఇస్తోంది కేంద్రమేనని ఆయన వెల్లడించారు. రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ పెట్టిన కేసీఆర్.. 5 లక్షల అప్పు చేసి దోచుకుతింటున్నాడని ఆయన ధ్వజమెత్తారు.

Exit mobile version