Site icon NTV Telugu

Bandi Sanjay : నిరాడంబరంగా బాధ్యతలు తీసుకోనున్న బండి సంజయ్ కుమార్

Bandi Sanjay

Bandi Sanjay

అత్యంత నిరాడంబరంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు బండి సంజయ్ కుమార్. రేపు ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ.

భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగా బండి సంజయ్‌ ఛార్జ్ తీసుకోనున్నారు. నాయకులు, కార్యకర్తలు సహకరించాలని బండి సంజయ్ కోరారు. నూతనంగా కేంద్ర కేబినెట్‌ మంత్రిగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా రేపు పదవి బాధ్యతలు స్వీకరించన్న జి కిషన్ రెడ్డికి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. బొగ్గు, గనుల శాఖ ద్వారా రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలు అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సింగరేణి బొగ్గు గనులపై పూర్తి అవగాహన ఉన్న కిషన్ రెడ్డి ఆ సంస్థ పురోభివృద్ధికి, సింగరేణి కార్మికులకు మరింత మేలు చేస్తారని బండి సంజయ్ ఆకాంక్షించారు.

Exit mobile version