Site icon NTV Telugu

Bandi Sanjay : తిరుమలను అపవిత్రం చేశారు

Bandi Sanjay

Bandi Sanjay

కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బండి సంజయ్‌ విమర్శించారు. స్వామి వారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని… స్వామికి, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని బండి సంజయ్‌ విమర్శించారు. అంతేకాకుండా.. ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లు వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం కొల్లగొట్టి వేల కోట్లను సంపాదించారని, ఎర్ర చందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దయ, భిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు బండి సంజయ్‌.

Exit mobile version