Site icon NTV Telugu

Bandi Sanjay : వాళ్ల ఒత్తిడితోనే ఎస్ఐ సస్పెండ్

Bandi

Bandi

హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఎస్ఐ అనిల్ విషయంలో జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉంది అని ఆయన అన్నారు. మానవత్వం లేకుండా ఎస్సై భార్య పైన ఓ యువతి బూతులు తిట్టింది అంటూ బండి సంజయ్ చెప్పారు. ఎస్సై భార్యనే భయ పెట్టారు.. విచారణ జరపకుండా.. ఎంఐఎం పార్టీ ఒత్తిళ్లకు తలోగ్గుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి

ఓల్డ్ సిటీ లో పోలీసులను కొడితే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఎస్సై ని సస్పెండ్ చేశారు అని ఆయన ఆరోపించారు. నిజాయితీ పరుడైన ఎస్సై పై చర్యలా తీసుకుంటారా అని ప్రశ్నించారు.

Also Read : Karnataka Elections: సీఎం ఎవరనేదానిపై అస్సలు మాట్లాడొద్దు.. కాంగ్రెస్ అధిష్టానం సూచన

ఓ మతానికి చెందిన వారు ర్యాలీ తీస్తే.. కేసులు ఎందుకు లేవు.. ఎస్సై ఘటనను మతం కోణంలో చూడొద్దు అంటూ బండి సంజయ్ అన్నారు. రేపు జగిత్యాల బంద్ ను విజయవంతం చేయాలి అని బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎస్సై పై విధించిన సస్పెండ్ ను వెంటనే ఎత్తేయాలి అని డిమాండ్ చేశారు.

Also Read : Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌.. జొన్న పంటకు మద్దతు ధర

హిందువుల్లో ఐక్యత కోసమే ఏక్తా యాత్ర చేస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్య అతిథిగా హాజరు అవుతారు అని బండి సంజయ్ చెప్పారు. ఈ నెల 14వ తారీఖున హిందు ఏక్తా యాత్ర భారీ ఎత్తున నిర్వహిస్తామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Exit mobile version