కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఆలుగునూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ సన్నాహక ఎన్నికల సమావేశంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న 316 బూత్ లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకురావాలని తెలిపారు. బండి సంజయ్ గెలిచిన అప్పటి నుంచి ఒక్క మండలానికి, గ్రామానికి వెళ్ళలేదు.. ప్రజల ఇబ్బందులు తెలుసుకోలేదు అని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. వచ్చే వర్షాకాల పంటలకు 500 రూపాయల బొనస్ తో ధాన్యం కొనుగోలు చేసి తీరుతామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఫ్రీ జర్నీ చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Also: Thummala Nageswara Rao: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి..
దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సీట్లు ఓట్ల కోసం తల్లిని కూడా బండి సంజయ్ అవమానించాడు.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రసాదం స్కీమ్ ను వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకి బండి సంజయ్ ఒక్క రూపాయి తీసుకు రాలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డకౌట్ అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ పోటీ పడేది బీజేపీ పార్టీతోనే అన్నారు. అవినీతి డబ్బును ప్రధాని మోడీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన చెందాలుగా తీసుకుంటే తప్పేంటి అని అనడం నాకు అయితే సిగ్గుగా అనిపిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.