మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం జోరుమీదుంది. ప్రచారంలో నాయకులు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధింస్తున్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం ఎస్.లింగోటం గ్రామంలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు మంచి వారో, ఎవరికి సాయం చేసే గుణం ఉందో మీరే ఆలోచించండని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఆపదలో ఉంటే ఆదుకునే నాయకుడు కావాలా? మిమ్ముల్ని నట్టేట ముంచే నాయకుడు కావాలా? ఆలోచించి ఓటేయండి.
Also Read : KD Movie: కేజీఎఫ్ కాపీలా ధృవ సర్జా ‘కెడి’
ప్రతి ఒక్క ఓటరు ఓటును వినియోగించుకోవాలి. 100 శాతం పోలింగ్ జరగాలి. పువ్వు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ బాక్సును బద్దలు చేయండి. దేశ్ కీ నేత కెసిఆర్ ను మునుగోడు నియోజకవర్గం లోకి లెంకలపల్లికి గుంజుకొచ్చిన ఘనత బీజేపీదే. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేయని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మునుగోడు కు వస్తున్నారు. కుల, వర్గం, వర్ణాల పేరుతో చీల్చేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది. టిఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ఊరంతా కలిసి ఒకే తాటిపై నిలబడి ఓటేయాలని కోరుతున్నా అని ఆయన అన్నారు.