NTV Telugu Site icon

Bandi Sanjay : కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుంది

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ మూడు రోజుల శిక్షణ శిబిరాలు నేటితో ముగిశాయి. అయితే.. చివరి రోజు ముగింపు సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే సీఎం కుటుంబానికి కమిషన్ ఇవ్వాలని, భాగ స్వామ్యం ఇవ్వాలని ఆయన అన్నారు. కేసీఆర్ ఏ రోజు రాష్ట్రానికి లాభం జరగాలి అని ఆలోచించడని ఆయన మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వమని, కేంద్ర నిధులు దారి మళ్లిస్తున్నాడని ఆయన ఆరోపించారు. పది లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు సాగుతుంది మోడీ ప్రభుత్వమని, కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రమోషన్ లు ఇవ్వకుండా రివర్సన్ లు ఇస్తున్నాడని, కమ్యూనిస్ట్ లు కార్మికుల కోసం అంటున్నారు… సీఎం దగ్గర మొకరిల్లారని, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లతో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్ వాళ్ల కార్యకర్తలకు చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా బీజేపీనీ అప్రదిష్ట పాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Megastar Chiranjeevi: అప్పుడు అవమానించారు.. ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు

తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. అంతేకాకుండా.. ‘ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాన్ని బీజేపీ రద్దు చేయదు. తెలంగాణలోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇస్తామని ప్రకటించాము, పేదలందరికీ పక్క గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పాము అధికారం లోకి వచ్చాక నెరవేరుస్తాము. కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ ను రగిల్చి అధికారం లోకి రావడానికి చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తెలుసుకోవాలి… ఈ దేశం కోసం పని చేసే వారు సంఘ్ ప్రచారక్ లు…అలాంటి వ్యక్తులను సీఎం అవమానిస్తున్నారు. సీఎం నీ లాంటి మూర్ఖుల నుండి రాష్ట్రాన్ని రక్షించడానికి వాళ్ళు పని చేస్తున్నారు….బి ఎల్ సంతోష్ జి ఏమి చేశారు. ఆయనకు ఫాంహౌస్ లు లేవు, బ్యాంక్ అకౌంట్ లు లేవు. అయన ఎమ్మెల్యే, ఎంపీ కావాలని అనుకోలేదు. అయన ఈ దేశం కోసం పని చేసే వ్యక్తి.. అయన జోలికి వస్తే బీజేపీ సహించే ప్రసక్తే లేదు. నీ కుటుంబం కోసం, నీ రాజకీయ లబ్ది కోసం, కొడుకు కూతురు స్కాంలో నుండి బయట పడేందుకు ఆయనను అవమానిస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.