Site icon NTV Telugu

Bandi Sanjay : ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదు

Bandi Sanjay

Bandi Sanjay

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తాను ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version