Site icon NTV Telugu

Bandi Sanjay: విద్యార్థులకు శుభవార్త.. 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్న బండి సంజయ్‌!

Bandi Sanjay 20000 Bicycles

Bandi Sanjay 20000 Bicycles

మోడీ కానుకగా.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థులకు 20 వేల సైకిళ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పంపిణీ చేయనున్నారు. రేపు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తొలిరోజు కరీంనగర్ టౌన్ టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు అందిస్తారు. ఇందుకోసం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

పాఠశాలలకు వెళ్లే నిరుపేద విద్యార్థులు రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి వచ్చింది. విద్యార్థులకు అండగా ఉండాలని 20 వేల సైకిళ్లను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఓ బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా బండి సంజయ్ రేపు సైకిళ్లను విద్యార్థులకు అందించనున్నారు. నెల రోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని టెన్త్ విద్యార్థులందరికీ సైకిళ్ల పంపిణీ పూర్తవనుంది. ప్రతి విద్యార్ధినీ, విద్యార్ధికి సైకిళ్లను అందజేసే బాధ్యత కలెక్టర్ ద్వారా విద్యాశాఖ అధికారులకు అప్పగించారు.

Also Read: HHVM Story: ‘హరి హర వీరమల్లు’ అసలు కథ ఇదేనా?

బండి సంజయ్ ప్రతి ఏటా తన బర్త్ డే సందర్భంగా సేవా కార్యక్రమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్ మెంట్స్, అంబులెన్స్, ఫ్రీజర్స్ సహా వైద్య పరికరాల అందజేశారు. పేదలకు వైద్యం, విద్య అందని ద్రాక్షలా మారకుండా ఉండడం కోసం బండి సంజయ్ తన వంతుగా సాయం చేస్తున్నారు.

Exit mobile version