NTV Telugu Site icon

Bandi Sanjay : రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష

Bandi Sanjay

Bandi Sanjay

రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో ‘రైతు దీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా రేపు (సోమవారం) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. ఎల్లుండి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమలుతోపాటు యుద్ద ప్రాతిపదికన నష్ట పరిహారం అందజేయాలని, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో ‘బండి’ ఉద్యమ సైరన్ ను మోగించారు. దీంతోపాటు ఏప్రిల్ తొలి వారం నుండి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయించడంతోపాటు తాలు, తేమ పేరుతో వడ్ల తరుగు లేకుండా రైతుల నుండి పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేేయించడమే లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్ల కల్లాల దగ్గర బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నారు. దీంతోపాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రైతుల పక్షాన ఎల్లుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ‘దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. రాష్టానికి అన్నం పెట్టే రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాలని విజ్ఝప్తి చేశారు. ఈ విషయంలో రాజకీయాలను, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు రైతు క్షేమం కాంక్షించే ప్రతి ఒక్కరూ తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. రైతులతోపాటు మహిళలు, వ్రుద్దులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు కోసం సైతం అతి త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఈ మేరకు 2, 3 రోజుల్లో యాక్షన్ ప్లాన్ ను రూపొందించి వెల్లడిస్తామని పేర్కొన్నారు.

రైతుల పక్షాన బీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే…