Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్ సర్కార్ పై బీజేపీ చీఫ్ ఫైర్!

Bandi Sanjay

Bandi Sanjay

ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దళిత ద్రోహి అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి, వర్థంతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు. దళిత నియోజకవర్గాల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ పొగిడిన శ్రీలంక, చైనా, పాకిస్థాన్ దేశాల పని అయిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమన్నారు.

Also Read : Manchu Mohan Babu: చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు

కేసీఆర్ బిడ్డను కాపాడేందుకు మంత్రివర్గం మొత్తం ఢిల్లీ పోయిందన్న బండి సీఎం మాత్రం రాష్ట్రంలో మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరిగిన పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వలన వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిని సిట్టింగ్ జడ్డ్ తో విచారణ జరిపించాలని కోరారు. కష్టపడి చదివి నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రేపు రాష్ట్రాంలోని అన్ని అసెంబ్లీ నియోజవర్గాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేస్తామని బండి సంజయ్ తెలిపారు.

Also Read : Sextortion Call : సరికొత్త ట్రాప్.. ‘సెక్స్‌టార్షన్’ బారిన పడ్డ 76ఏళ్ల వ్యక్తి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు సర్వ నాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్దమైన సంస్థ కదా.. ఎలా కమిషన్ ను రద్దు చేస్తారని ప్రశ్నించగా.. ఈడీ, సీబీఐ కూడా రాజ్యాంగబద్దమైన సంస్థలే అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఈ మేరకు తప్పు చేయప్పుడు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ ఎందుకు చేయించలేకపోతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకు పనికిరాదన్న ఆయన.. పేపర్ లీకేజీ ఘటనలో నిందితురాలిగా ఉన్న రేణుక వాళ్ల అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్ గా ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Exit mobile version