NTV Telugu Site icon

Bandi Sanjay : ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నం

Bandi Sanjay

Bandi Sanjay

రాహుల్ గాంధీపై దాడి జరగలేదు.. కాంగ్రెస్ వారు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నమని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని, ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆరెస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బ తిన్నాయని, అయోధ్య కు రాహుల్ ఎందుకు రాలేదన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, రాముడి దేవాలయంపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా అని ఆయన వ్యాఖ్యానించారు. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా అని ఆయన ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని, ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారన్నారు.

అంతేకాకుండా.. ‘అయోధ్యలో ప్రధాని చేతుల మీదుగా రామాలయ ప్రాణ ప్రతిష్ట జరగడం సంతోషం. హిందువుల 5 శతాబ్దాల చిరకాల వాంఛ అయోధ్య రామ మందిర నిర్మాణం. అంతటి గొప్ప మహత్కార్యాన్ని వీక్షించిన ఈ తరం ప్రజలు చేసుకున్న పూర్వ జన్మ సుక్రతం. ఈ అద్బుత సన్నివేశాన్ని చూసి జై శ్రీ రాం అనే నినాదాలతో దేశమంతా మారుమోగుతోంది. అక్కడ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంటే… రామ భక్తుల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. అద్బుత సన్నివేశమైన రామాలయ ప్రాణ ప్రతిష్టను చూస్తామని ఈ తరం వాళ్లు అనుకోలేదు. ప్రధానమంత్రి మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుదలతో, సంకల్పంతో రామ మందిర ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆనాడు అయోధ్యలో కరసేవకులను కాల్చి చంపిన చరిత్ర సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు సరయు నదిలో కరసేవకుల రక్తంతో ఏరులై పారిన ద్రుశ్యాలు నా కళ్ల ముందు మెదులుతున్నాయి.

కరసేవకుల బలిదానాలు వ్రుథా కాలేదు…. వారి స్పూర్తితో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగింది. అయోధ్యలో పాత కట్టడం కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల తొలి బ్యాచ్ మాదే. నాతోపాటు గుజ్జ శ్రీనివాస్ సహా ఎంతో మంది కరసేవకులు అయోధ్య కరసేవ సందర్భంగా తిండికి లేక అనేక ఇబ్బందులు పడ్డాం. పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నా… అక్కడి నుండి పంపించాలని చూసినా వెనుకదిరగకుండా కట్టడాన్ని కూల్చేదాకా అక్కడే ఉన్నాం. కట్టడం కూల్చివేత అనంతరం వెనుదిరిగి వస్తుంటే.. మాపై దాడులు చేశారు. ఆనాడు తాత్కాలిక రామాలయం నిర్మాణంలో పాలుపంచుకున్నామనే త్రుప్తి మాకు మిగిలింది. నాటి కరసేవలో బలిదానమైన కరసేవకుల త్యాగాలు వ్రుధా కానీయకుండా రామాలయాన్ని నిర్మించిన ప్రధానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

నేటి రామ మందిర నిర్మాణం ఆ కరసేవకులకే అంకితం. రాహుల్ గాంధీ అసోంలో ధర్నా పెద్ద డ్రామా. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహత్కార్యాన్ని దారి మళ్లించేందుకే రాహుల్ గాంధీ కుట్ర. అయోధ్యలో గొప్ప కార్యం జరుగుతుంటే ఇక్కడేం పని అని అడిగితే అడ్డుకోవడమా? రాముడు అందరి దేవుడే కదా…. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి? 1959లొ రామ మందిరాన్ని కూల్చివేసిన చోటకు రాహుల్ గాంధీ తాత నెహ్రూ వెళ్లి బాబర్ మసీదును సందర్శించిన మాట నిజం కాదా? 1968లో ఇందిరాగాంధీ శ్రీక్రుష్ణ జన్మస్థానమైన మధిరను ఈద్గాకు కేటాయిస్తానని అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? 1992లో అయోధ్య రామ మందిరం ఉన్న చోటే బాబ్రీ మసీదును కట్టిస్తానని నాటి ప్రధాని పీవీ నర్సింహారావు చేత బలవంతంగా ప్రకటన చేయించిన చరిత్ర కాంగ్రెస్ ది కాదా? దేశమంతా రామమయమై జై శ్రీరాం అంటుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు కడుపు నొప్పి వస్తోంది?

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు దేశంలోని ప్రముఖులు, సాధు సంతతులంతా వచ్చారు కదా… వారు రాజకీయ పార్టీలకు చెందిన వారు కాదే…? అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఉన్నట్లు ఆధారాల్లేవన్న రాజకీయ నేతలు, హేతువాదులు ఈ దేశ పౌరులేనా? అత్యున్నత సుప్రీంకోర్టు రాముడు అయోధ్యలో జన్మించినట్లు ఆధారాలున్నాయని తీర్పునిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే ప్రశ్నిస్తారా? సుప్రీంకోర్టును, రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తారా? రామ మందిర ప్రాణ ప్రతిష్టను ప్రశ్నించే వాళ్లను కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారు. అయోధ్య ఘట్టాన్ని హేతువాదులు, కాంగ్రెస్ వాదులంతా మూర్ఖులు…ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Show comments