మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం లో భాగంగా కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కి అడ్డా…పాలమూరు లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బండి సంజయ్. తెలంగాణ లో 10 కి పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ దగాకోరు పార్టీ… ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురించేసింది…కబ్జాలకు పాల్పడిన నాయకులందరు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు.. రేపు అసెంబ్లీలో బల నిరూపణ
అంతేకాకుండా… కృష్ణా జలాలపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలపై బీజేపీ ప్రజల్లోకి వాస్తవ విషయాలను తీసుకెళ్తుంది…గత ప్రభుత్వాలు చేసిన అక్రమాలను బీజేపీ బయటపెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పటికి కేసీఆర్ సీయం అనుకుంటున్నారు…బీఆర్‌ఎస్ పార్టీ కొంప ముంచిందే కేటీఆర్ అని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరు లో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుంది.. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బిఆరెస్ పార్టీ లు రెండు ఒక్కటే అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ లో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిందేనని, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే కాంగ్రెస్ గెలిచిందే తప్ప.. కాంగ్రెస్ మీద అభిమానంతో జనం ఓట్లు వేయలేదని తెలిపారు. అన్ని సర్వే ఫలితాలు పాలమూరు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు ఎంపీ బండి సంజయ్.
BIG Shock: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేయనున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే..