Bandi Sanjay : సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు.
Harish Rao : సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల హరీష్ రావు ఫైర్
రేవంత్ రెడ్డికి అంబేద్కర్ పై నిజంగా ప్రేమ ఉందా? అంబేద్కర్ పై అభిమానం ఉంటే…. ఎన్టీఆర్ ఘాట్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు నివాళులు అర్పించడం లేదు? అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆ విగ్రహం ఎవరు పెట్టారు అనేది కాదు… అది ప్రజల సొమ్ముతో నిర్మించిన మహనీయుడి విగ్రహం కదా? అని ఆయన అన్నారు. బీజేపీకి దళితుల మద్దతు ఉంది కాబట్టే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ దళితుల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా తెచ్చుకోలేకపోతోందన్నారు బండి సంజయ్. ఆనాడు కేసీఆర్ మధ్యలోనే అంబేద్కర్ విగ్రహ పనులను నిలిపేస్తే… బీజేపీ ఆ పనులను సందర్శించి వార్నింగ్ ఇస్తేనే పూర్తి చేశారన్నారు బండి సంజయ్.
Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)