Site icon NTV Telugu

Bandi Sanjay : మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారు

Bandi Sanjay

Bandi Sanjay

గవర్నర్‌ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని, కావాలనే గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల కోసం బీజేపీ చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తోందని, ఎస్ఐ, కానిస్టేబుల్ సమస్యలను పరిష్కరించాలని, డీజీపీ ఆఫీస్ కు పోతే బీజేపీ కార్యకర్తలు మీద విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారని ఆయన దుయ్యబట్టారు. బయటకు కనిపించకుండా గాయాలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మధ్యకాలంలో పోలీసుల దాడులు చాలా ఎక్కువయ్యాయని, పోలీస్ ల దాడిలో గాయాలపాలైన భానుప్రసాద్ కు ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ట్రీట్ మెంట్ జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Graham Reid: వరల్డ్‌కప్‌లో ఓటమి.. టీమిండియా కోచ్ రాజీనామా

దేశంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ కంటే ఎక్కువగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో కండిషన్స్ ఉన్నాయని, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నిజాం రాజులా ప్రవర్తిస్తున్నారని, ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. ‘బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదు..ఎక్కడ ఏర్పాటు చెయ్యాలో చెప్పలేదు. కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిలో చర్చకు రావాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. సర్పంచుల నిధులన్నీ కెసిఆర్ దోచుకున్నాడు. ఎంపీ అరవింద్ మీద కూడా లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అరవింద్ లిక్కర్ దందా చేయలేదు. అరవింద్ పత్తలాట ఆడలేదు’ అని బండి సంజయ్‌ అన్నారు.

Also Read : AP Three Capitals: మూడు రాజధానులపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Exit mobile version