Site icon NTV Telugu

Bandi Sanjay : దుబాయిలో తెలంగాణ వాసుల హత్యపై కేంద్ర మంత్రి ఆరా

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : పాకిస్తానీ చేతిలో దుబాయిలో దారుణంగా హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్ సాగర్ తోపాటు హత్యకు గురైన నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్ మృత దేహాలను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రి ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే విదేశీ వ్యవహారాల మంత్రి కార్యాలయంతో మాట్లాడారు. వెంటనే దుబాయిలో హత్యకు గురైన ప్రేమ్ సాగర్, శ్రీనివాస్ మృత దేహాలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులు సైతం దుబాయి అధికారులతో మాట్లాడారు. వీలైనంత తొందరలో ఆయా మృత దేహాలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు.

PBKS vs KKR: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Exit mobile version