NTV Telugu Site icon

Bandi Sanjay : బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టేసిన కోర్టు

Bandi Sanjay

Bandi Sanjay

టెన్త్ హిందీ పేపర్ లీకేజీ స్కాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసుల దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన హన్మకొండ కోర్టు. పేపర్ లీక్ స్కాం కేసులో రాజకీయ కక్షతోనే బండి సంజయ్ ను నేరస్తుడిగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వాదించారు బండి సంజయ్ తరపు న్యాయవాదులు. టెన్త్ పేపర్ లీకేజీ స్కాంతో బండి సంజయ్ కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని సీనియర్ న్యాయవాదులు ఎల్.రవించందర్, కరుణాసాగర్ పేర్కొన్నారు. విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్ ను స్వాధీనం చేయాలని కోరడం పట్ల బండి సంజయ్ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read : RR vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

అప్పటికే మొబైల్ మిస్ అయ్యిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఆ మేరకు ఫిర్యాదు నమోదైందని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ కోర్టును తప్పుదోవపట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఆర్టికల్ 23 ప్రకారం… ఎవరైనా నేరస్తునిపై మోపబడ్డ అభియోగాన్ని నిరూపించేందుకు సాక్షాలు చూపాలే తప్ప బెదిరింపులకు పాల్పడటమంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనన్న బండి సంజయ్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. సుధీర్ఘ విచారణ అనంతరం బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ న్యాయ స్థానం కొట్టివేసింది.

Also Read : MP Dharmapuri Arvind : రైతుల ఆత్మహత్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది

Show comments