Site icon NTV Telugu

Bandi Sanjay : దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు

Bandi Sanjay On Amit Shah

Bandi Sanjay On Amit Shah

కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి అని, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరన్నారు. కర్ణాటకలో మా ఓట్లు తగ్గలేదు.. 36 శాతం ఓట్లు సాధించామన్నారు బండి సంజయ్‌. కాంగ్రెస్ కి 5 శాతం ఓటింగ్ పెరిగింది జీడీఎస్‌ ఓట్లు 7శాతం తగ్గిందని, కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయాలు చేసాయని ఆయన ఆరోపించారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయి… 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. అంతేకాకుండా.. భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని ముస్లిం రిజర్వేషన్లు అని మతతత్వ రాజకీయాలు చేసాయి.. జేడీఎస్‌ అధ్యక్షుడు బహిరంగంగా చెప్పారు.

Also Read : Andhra Pradesh Crime: యువతులతో నగ్న పూజలు.. బంధించి అత్యాచారం..!

జేడీఎస్‌ ఓట్లు కాంగ్రెస్ కి వేయాలని చెప్పారు. ఎంఐఎం, ఎన్‌డీపీఐ, జేడీఎస్‌, కాంగ్రెస్ అందరూ కలిశారు. రేపు భజరంగ్ దళ్ ని నిషేదించి.. పీఎఫ్‌ఐపై నిషేధం ఎత్తివేస్తారు.. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు.. తెలంగాణలో 5 ఉప ఎన్నికలు జరిగాయి.. 3 బీజేపీ గెలిచింది.. కాంగ్రెస్ కి డిపాజిట్లు రాలేదు. తెలంగాణ లో బీజేపీ పుంజుకుంటోంది… మా ఓటింగ్ శాతం పెరిగింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం రేపు తెలంగాణలో కలిసే పోటీ చేస్తాయి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ లో పెట్టేందుకు కేసీఆర్ సహాయం చేస్తారు.. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి డబ్బులు సాయం చేసింది.’ అని ఆయన అన్నారు.

Also Read : IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?

Exit mobile version