NTV Telugu Site icon

Bandi Sanjay : కార్ల రేసింగ్ ట్రయల్స్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారా?

Bandi Sanjay

Bandi Sanjay

కార్ల రేసింగ్ ట్రయల్స్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారా? అని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్. తాజాగా ఆయన… నగరం నడిబొడ్డున ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో కొస్తే ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా మెరుగ్గా కార్ల రేసింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్ల రేసింగ్ కు పెట్టే ప్రతిపైసా, వసూళ్ల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తామన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ ట్రయల్స్ ను నిర్వహిస్తూ ప్రజలకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్ల నగర ప్రజలు పూర్తిగా ట్రాఫిక్ తో సతమతమవుతున్నారు. అత్యవసర అంబులెన్స్ సర్వీసులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి.

Also Read : FIFA World Cup: అంగరంగ వైభవంగా షురూ.. ఆ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్
కార్ల రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు పరిసరాలన్నీ పోలీసులు దిగ్బంధించడం ఎంతవరకు సమంజసం? ఆయా రోడ్లన్నీ బ్లాక్ చేయడంవల్ల ఏర్పడిన తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు, ప్రజలకు ప్రాణాలకు, జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? టీఆర్ఎస్ నేతలు నగర శివారుల్లో వేలాది ఎకరాలు కబ్జా చేశారు. ఆ స్థలాల్లో ఇట్లాంటి రేసులు నిర్వహించుకోవచ్చు కదా… నగరం నడిబొడ్డున నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు భావ్యం?
Also Read : Turkish Airstrikes: టర్కీ వైమానిక దాడులు.. సిరియా, ఇరాక్‌లో 89 కుర్దిష్ మిలిటెంట్ స్థావరాలు ధ్వంసం
కార్ల రేసింగ్ నిర్వహణకు బీజేపీ వ్యతిరేకం కాదు… కార్ల రేసింగ్ ను స్వాగతిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కార్ల రేసింగ్ నిర్వహించాలన్నదే బీజేపీ ఉద్దేశం. అయితే ట్రాఫిక్ కు ఇబ్బంది లేని రీతిలో శాశ్వత ప్రాతిపదికన కార్ల రేసింగ్ నిర్వహించాలి.అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రజా ధనాన్ని అడ్డగోలుగా లెక్కా పత్రం లేకుండా ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. కార్ల రేసింగ్ పేరుతో ఖర్చు పెట్టే ప్రతి పైసాతోపాటు టిక్కెట్ల పేరుతో వసూలు చేసే డబ్బు వివరాలను సైతం ప్రజలకు అందుబాటులో ఉండేలా పారదర్శకంగా వ్యవహరిస్తాం.’ అని బండి సంజయ్‌ అన్నారు.

Show comments