Site icon NTV Telugu

Bandi Sanjay : విజయశాంతికి ఈ పార్టీనే చివరి మజిలీ

Bandi Sanjay Vijayashanti

Bandi Sanjay Vijayashanti

బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. విజయశాంతికి ఈ పార్టీనే చివరి మజిలీ అని ఆయన అన్నారు. కేసీఆర్‌ వల్ల ఎందరో మోసపోయారని, అడ్డంకులు లేకుండా ఆమె లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీలో ఎవరైనా ఏ పదవి అయినా రావొచ్చని ఆయన వెల్లడించారు. పార్లమెంట్‌లో జై తెలంగాణ అని గర్జించింది విజయశాంతి అని ఆయన వెల్లడించారు. కేసీఆర్‌ జిమ్మిక్కులుతో నమ్మించి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన మండిపడ్డారు. చాలా మంది బీజేపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. పార్టీనీ వీడి వెళ్ళిన వారు తిరిగి రావాలని కోరుతున్నానన్నారు. ఘర్ వాపసి .. కలిసి పోరాటం చేద్దామని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విజయశాంతి మాట్లాడుతూ.. 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం.. బీజేపీ సిద్దాంతం, క్రమశిక్షణ నచ్చి 1998 లో పార్టీ లో చేరానన్నారు. తెలంగాణకు ఏదో చేయాలని తపన ఎప్పుడు ఉండేదని, సోనియా గాంధీకి పోటీగా ఉండాలని అద్వానీ చెప్పారన్నారు.

Also Read : Vijayashanti : సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యాను

సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యానని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూలి పోయే పరిస్థితి వచ్చిందని, బ్లాక్ మెయిల్ చేశారన్నారు. సమైక్య వాదుల ఒత్తిడి వల్ల 2005లో నేను బీజేపీకి రాజీనామ చేశానని, తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఎన్నో వ్యయ పర్యవసానాలు ఎదుర్కొన్నానన్నారు. ఆ సమయంలో ఒక రాక్షసుడు కేసీఆర్‌ ఎంటర్ అయ్యాడని, నమ్మదగ్గ వ్యక్తి కాదని నాకు అప్పుడే అర్థం అయిందన్నారు. లొంగదీసి పార్టీలో విలీనం చేసుకోవాలని చూసాడన్నారు. వ్యక్తిత్వాన్ని కించ పరిచే ప్రయత్నం చేశాడని ఆమె వ్యాఖ్యానించారు. తప్పని సరి పరిస్థితిలో విలీనం చేశానని, ఏనాడు సంతృప్తిగా లేనన్నారు. నన్ను ఎంపీగా ఓడగొట్టాలని కేసీఆర్‌ చూసాడని ఆమె ఆరోపించారు.

Also Read :CP CV Anand : నాకు గుర్తింపు వచ్చింది మీడియాతోనే

Exit mobile version