Site icon NTV Telugu

Bandi Sanjay : అగ్నిపథ్‌పై గందరగోళపరిచేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి

Sanjay Bandi

Sanjay Bandi

‘అగ్నిపథ్‌’ మంచి పథకమని పేర్కొంటూ ప్రతిపక్షాలు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. పథకంలో ఏదైనా సమస్య ఉంటే సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాల కుట్రలో ఇరుక్కుని విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండవద్దని సూచించారు. ఆదివారం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ నుండి ప్రాతినిధ్యాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 
Ponnam Prabhakar : కులం.. సమాజాన్ని సమానంగా నడిపిన వ్యక్తి సర్వాయి పాపన్న..
 

దేశానికి ఆర్మీ జవాన్లే కీలమని, వాళ్లే రియల్ హీరోస్ అని అన్నారు. ఎంతో నిబద్దతతో వేలాది మంది విద్యార్ధులను తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే దేశం కోసం సేవ చేయాలని మిమ్ముల్ని ఇక్కడికి పంపిన మీ తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని కొనియాడారు. ఇక అగ్నిపథ్ పథకం చాలా అద్భుతమైనదని, దీనిపై లేనిపోనివి చెప్పి విద్యార్ధులు యువతను రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. దీనిపై ఆరోపణలు చేసి యువతను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. యువత ఆలోచించాలని, ఈ పథకంతో ప్రతీ ఏడాది వేల ఉద్యోగాలు వస్తాయని, ఎంతోమంది అగ్నివీరులు తయారవుతున్నారని బండి సంజయ్ తెలిపారు.

 Sinus Problem: సైనస్ సమస్యకు అసలు కారణమేంటో తెలుసా.?

Exit mobile version