Site icon NTV Telugu

Bandi Sanjay : కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది.. ఇదే ప్రజాస్వామ్యమా?

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్‌లో సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు.. నూతన పంచాయతీ భవనాలు ప్రారంభించుకోకుండా సర్క్కులర్ ఇవ్వడమా? అని అన్నారు ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది…ఇదే ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. నేను సీఎంకు లేఖ రాసినా స్పందన లేదన్నారు బండి సంజయ్‌. బీఆర్ఎస్ మాదిరిగానే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని, చేసిన పనులకు బిల్లులివ్వరు… కనీసం రికార్డుల్లోకి ఎక్కివ్వరని ఆయన మండిపడ్డారు. ఇట్లయితే సర్పంచులుగా పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, కాంగ్రెస్ నుండి సర్పంచుగా పోటీ చేయరని, తక్షణమే పెండింగ్ బిల్లలున్నీ మంజూరు చేయండన్నారు బండి సంజయ్‌. నూతన భవనాలను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వండని, విపక్షాల నిర్మాణాత్మక సూచనలు పరిగణలోకి తీసుకోండన్నారు. లేనిపక్షంలో మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారని, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలోని స్వయంభూ శ్రీ మల్లిఖార్జున స్వామిని బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ బండి సంజ‌య్‌కుమార్ ద‌ర్శించుకున్నారు.ఈ సంద‌ర్భంగాఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం పూజారులు వేద ఆశీర్వ‌చ‌న‌లు అంద‌జేసి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన బండి సంజ‌య్‌కు మైలారం గ్రామ‌స్తులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు.

Exit mobile version