Temple- Mosque Issue: శ్రీరాముడు శివుడికి జలాభిషేకం చేసిన ఆలయం?.. పక్కనే వెలిసిన మసీదు?
- ఊపందుకున్న బంబేశ్వర్ పర్వతం సమీపంలో ఆలయం-మసీదు అంశం
- హిందూ సంఘాల నిరసనలు
- మసీదును అక్రమంగా నిర్మించారని నినాదాలు
- అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు
- విచారించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హిందూ కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరించారు.
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర…
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర శ్రీరామునికి సంబంధించినదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ అంశం పురాణాల్లో కూడా ఉందని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ శివాలయం ఉంది. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి శివునికి జలాభిషేకం చేశాడని నమ్మిక. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆలయం ఉంది. అయితే.. కరోనా కాలంలో పర్వతం వెనుక ఉన్న వ్యక్తులు అక్రమంగా ఒక సమాధిని నిర్మించారని, ఆ తర్వాత దానిని మసీదుగా మార్చారని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు చంద్ర మోహన్ బేడీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మసీదును తొలగించాలని సీఎం యోగిని వీహెచ్‌పీ ఇటీవల డిమాండ్ చేసింది.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు..
ఈ ఘటనను నిరసిస్తూ.. నవంబర్ 8న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలందరూ మసీదు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు వివరించారు. . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదు చుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ బేడీ మాట్లాడుతూ.. అక్కడ ఎన్నో ఏళ్లుగా బామ్‌దేవ్ (బంబేశ్వర్) పవిత్ర క్షేత్రము ఉందని తెలిపారు. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెప్పారు. ఇది చాలా పురాతనమైన పర్వతమని.. వెనుక వైపున, కొందరు వ్యక్తులు మొదట అక్రమంగా సమాధిని నిర్మించి ఇప్పుడు దాన్ని మజీద్గా మార్చారని తెలిపారు. అనుమతి లేకుండా ఏదైనా నిర్మాణాన్ని తీసివేసేలా చర్యలు తీసుకోవాలని.. చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును కూల్చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!