Site icon NTV Telugu

BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా టైగర్లు.. తొలి టీ20 సిరీస్ గెలుపు..!

Ban Vs Sl

Ban Vs Sl

BAN vs SL: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్రను తిరగరాసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్, సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్‌కి తొలి టీ20 సిరీస్ గెలుపు. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్‌కు ఇది విదేశీ గడ్డపై రెండో టీ20 సిరీస్ విజయం. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించిన తర్వాత, ఇప్పుడు శ్రీలంకపై మరో సిరీస్ గెలిచిన లిటన్ విదేశాల్లో రెండు టీ20 సిరీస్‌లు గెలిపించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

Read Also:Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత

ఇక నిర్ణయాత్మక మూడో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, బంగ్లాదేశ్ బౌలింగ్‌ ఎటాక్ కు పెద్ద స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులకే పరిమితమయ్యారు. పాతుమ్ నిస్సంక 39 బంతుల్లో 46, దాసున్ శనక 25 బంతుల్లో 35 పరుగులతో చెప్పుకోతగ్గ స్కోర్ చేశారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 4 వికెట్లతో మెరుపులు మెరిపించగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షారిఫుల్ ఇస్లాం, షమీమ్ హుస్సేన్‌లు తలో వికెట్ తీశారు.

Read Also:Mysterious Village : ఈ గ్రామంలో ఒక వింత శబ్దం వినిపిస్తోంది.. ఆ మర్మమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా..?

ఇక 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ 47 బంతుల్లో 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. లిటన్ దాస్ 32 పరుగులు చేసి సహకరించగా, తౌహిద్ హృదోయ్ 25 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 16.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ విజయం అందుకుంది. ఇక లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్‌కి శ్రీలంకపై వారి సొంతగడ్డపై తొలి టీ20 సిరీస్ గెలుపు లభించింది. ఇది బంగ్లా క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి.

Exit mobile version