Sitaphal : తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో పెరుగుతున్న సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (GI) పొందేందుకు శ్రీకొండా లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే అధ్యయనాలు జరుపుతూ గణాంకాలు సేకరిస్తున్నారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఈ ప్రాజెక్టుకు రూ. 12.70 లక్షల సహాయం అందించాలని ముందుకొచ్చింది. మొదటగా బాలానగర్ అడవుల్లో పుట్టిన ఈ సీతాఫలం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది.
Hyderabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్.. భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా..
ఆగస్టు చివరి నుండి నవంబరు చివరి వరకు ఈ సీతాఫలం స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంటుంది. రుచి, నాణ్యత విషయంలో మంచి గుర్తింపు పొందిన ఈ సీతాఫలం, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. ఇక, మార్కెట్లో హైబ్రిడ్ పండ్లు అధికంగా ఉండటంతో, బాలానగర్ సీతాఫలాలకు ప్రాముఖ్యతను కాపాడుకునేందుకు, భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. జీఐ గుర్తింపు వచ్చిన వెంటనే, ఈ పండ్లకు చట్టబద్ధ రక్షణ లభిస్తుందని, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు.
Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?