బీఆర్కే భవన్ లో సీఈఓని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. ఈ నెల 27 వ తేదీ నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే రోజు జరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనం తో కూడిన సెలువు ప్రకటించాలని వెంకట్ కోరారు. గ్రాడ్యుయేట్ పోలింగ్ శాతం ఎక్కువగా జరుగాలన్నారు. ఒక జిల్లా వారు ఇంకో జిల్లాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారని.. పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్ళాలి కాబట్టి ఓటు హక్కు ఉన్నవారికి వేతనం తో కూడిన సెలువు ఇవ్వాలని వెంకట్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థనపై సీఈఓ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
READ MORE: Naga Chaitanya: మూడున్నర కోట్ల కారు కొన్న చైతూ.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
కాగా.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మరోసారి అధిష్ఠానం అవకాశం కల్పించింది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రచారం ప్రారంభించాయి. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఈ క్రమంలోనే.. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి.