NTV Telugu Site icon

Balka Suman : రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది

Balka Suman

Balka Suman

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం లో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందన, రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడన్నారు. రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారని, కొడంగల్ లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే మా జెడ్పిటీస్ మహిపాల్ అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డి కి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు ..ఆయనకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తోడుగా ఉన్నారని, కొండల్ రెడ్డి కాన్వాయ్ లో పదుల సంఖ్యలో వాహనాలు ఉంటాయి ..వారికి అధికారులు రాచ మర్యాదలు చేస్తారన్నారు బాల్క సుమన్‌.

Peddireddy Ramachandra Reddy: మాపై నిరాధారా ఆరోపణలు సరికాదు..అభివృద్ధిపై దృష్టి పెట్టండి?

రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయో తో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని, ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిది అని ఆయన వ్యాఖ్యానించారు. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యిందని, ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆద్వర్యం లో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీ ని వైట్ గా మారుస్తున్నారని, రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లు గా ఉన్నారన్నారు. రేవంత్ సోదరులు రియల్టర్ల ను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదు ..ఇలాంటి బోగస్ పనులు మానుకోవాలని, బీ ఆర్ ఎస్ బీజేపీ లో విలీనం అవుతుందని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళే ప్రచారం చేస్తున్నారన్నారు బాల్క సుమన్‌.

Anna Canteens: ముస్తాబవుతున్న అన్న క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ

Show comments