NTV Telugu Site icon

Balka Suman: ఎన్నికలు వస్తున్నాయని ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు..

Balka Suman

Balka Suman

మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని చాలా మంది వచ్చి ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే ప్రయత్నాలు చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాల్క సుమాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో హాడావుడి చేస్తుంది.. 1969లో యువకులను చంపింది కాంగ్రెస్ పార్టీ.. 2004లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని మోసం చేసింది అని ఆయన విమర్శించారు. నీళ్లు ఇవ్వలేదు, నిధులు ఖర్చు పెట్టలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Mouni Roy: బ్లాక్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న మౌని రాయ్

చంద్రబాబు ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని బాల్క సుమాన్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం చేస్తే సమైక్యవాదానికి మద్దతుగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. ధరణి తీసేస్తా అంటున్నారు.. దళిత బంధు, సంక్షేమ పథకాలే వద్దంటున్నారు.. అలాంటి బీజేపీ-కాంగ్రెస్ పార్టీల వైఖరిలను జనం అర్థం చేసుకోవాలి.. తెచ్చుకున్న తెలంగాణ కేసిఆర్ చేతిలో ఉంటే శ్రీరామక్ష అని బాల్క సుమాన్ అన్నారు.

Read Also: AP CM Jagan: రెండు రోజుల పాటు సీఎం జగన్‌ బిజీ షెడ్యూల్ ఇదే..

కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాలు వాటా పంచకుండా మోసం చేస్తుంది.. ప్రాణహిత చేవేళ్ల వద్ద ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి తీయకుండా కాంట్రాక్టర్ల వద్ద అడ్వాన్ తిన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ నేతలది అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలకు అవకాశం ఇస్తే.. తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతుందని బాల్క సుమాన్ అన్నారు. ప్రజలకు కేసీఆర్ అండగా ఉన్నారు.. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని బాల్క సుమాన్ ధీమా వ్యక్తం చేశారు.