అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీ.. బ్లాక్ మెయిల్ కు పేటెంట్ రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల ముఠా బ్యాచ్‌కి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని, రాష్ట్ర రాజధానిలో సచివాలయం, అమరవీరుల స్మారక సౌధం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టడం కాంగ్రెస్, బీజేపీలకు మింగుడు పడటం లేదన్నారు. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ లో తెలంగాణపై మాట మార్చిన విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు.
Also Read : Upasana: బేబీ బంప్ తో ఉపాసన.. పుట్టబోయే బిడ్డ గురించి చరణ్ ఏమన్నాడంటే
అంతేకాకుండా.. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో 2004 నుండి 16 వరకు వెయ్యి మందికి పైగా ఆమరులవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా. కాంగ్రెస్ పార్టీ A to Z స్కాం గ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ హయాంలో ఏ వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ హయాంలో గాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గాని రైతుబంధు రైతు భీమా లాంటి ఒక్క పథకం అమలు చేయడం లేదు. ఎవరి వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునే దమ్ము లేక మా పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. కేసులతో భయపెట్టి మధురం చేయాలని కుట్ర చేస్తున్నారు. మోడీ తాటాకు చప్పుల్లకు భయపడేది లేదు.
Also Read : Special App: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగే ప్రశ్నలకు సత్వర సమాధానాలు
ఉద్యమ సమయంలో వందల కేసులు ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. అదానీ.. ప్రధాని బినామీ. కేసీఆర్ ని ఎదుర్కునే దమ్ము లేక కవితపై ఈడీ దాడులు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి. బీజేపీ పార్టీకి కూల్చుడు పేల్చుడు తప్ప ఏమీ తెలియవు.తెలంగాణకి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష.’ అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.