NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: బాలినేని రాజీనామాపై వైసీపీలో ఉత్కంఠ.. నేడు సీఎం జగన్‌తో భేటీ..

Balineni

Balineni

Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి మాట్లాడేందుకు ప్రయత్నించినా బాలినేని వెనక్కి తగ్గడంలేదు.. దీంతో, నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడాలంటూ సీఎంవో అధికారుల నుంచి ఆయనికి సమాచారం వెళ్లిందట.. దీంతో.. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు బాలినేని.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు.. సీఎం జగన్‌, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మధ్య జరిగే భేటీలో ప్రస్తావనకు వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: Pawan Kalyan: అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది.. ఆదుకోండి..

కాగా, ఏడాది క్రితం జరిగిన క్యాబినెట్‌ విస్తరణలో మళ్లీ తనకు చోటు దక్కలేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బాలినేని. ఆయన అనుచరులు హంగామా చేయటం, సజ్జల లాంటి వ్యక్తి బాలినేని ఇంటికి రెండు మూడు దఫాలు తిరిగి బుజ్జగించటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్ సైతం క్యాంపు ఆఫీసుకు బాలినేనిని పిలిపించుకొని స్వయంగా మాట్లాడారు. దీంతో అప్పట్లో బాలినేని అలకపాన్పు దిగారు. తాజాగా సీఎం జగన్‌ సభలో ప్రొటోకాల్ అంశం బాలినేనిలో అసంతృప్తికి కారణం అయ్యిందనే చర్చ జరుగుతోందట. అయితే, మరోసారి సీఎం జగన్‌తో బాలినేని సమావేశం కానుండడంతో.. వెనక్కి తగ్గేదే లేదంటున్న బాలినేని మళ్లీ మెత్తబడతారా? యథావిథిగా వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పోస్ట్‌లో కొనసాగుతారా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.