NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: సీఎంవోకు మాజీ మంత్రి బాలినేని.. సీఎం జగన్‌తో భేటీకి ఛాన్స్..

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: ఒంగోలు పోలీసుల తీరుపై సీరియస్‌ అయిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌.. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేశారు.. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.. ఇది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.. అయితే, ఈ రోజు సీఎంవోకు వెళ్లనున్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో భేటీ కానున్నారు.. అయితే, గన్ మెన్స్, ఎస్కార్ట్ లేకుండానే హైదరాబాద్ నుంచి సీఎంవోకు బయలుదేరి వెళ్లారు బాలినేని.. ఇటీవల ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్స్ స్కాంలో సిట్ పరిణామాల నేపథ్యంలో గన్ మెన్లను బాలినేని సరెండర్‌ చేసిన విషయం విదితమే..

సీఎంవోతో జరిగే భేటీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు.. ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌.. కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. ఆయన తన పర్యటనను ముగించుకుని వచ్చిన అనంతరం సీఎం జగన్ తో బాలినేని భేటీ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను పార్టీ అధినేతకు బాలినేని వివరించేందుకు సిద్ధమయ్యారట.. అయితే, సీఎం జగన్ తో బాలినేని భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా, ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు బాలినేని.. కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరిన బాలినేని.. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని.. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అంటూ ఆవేదన వెలిబుచ్చారు.. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని.. అందుకే తన గన్‌మెన్‌లను తక్షణం సరెండర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు బాలినేని.. అయితే.. మాజీ మంత్రి, అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే బాలినేని వ్యవహారం చర్చగా మారగా.. ఇప్పుడు సీఎంవో.. సీఎం జగన్‌ వద్దకు ఈ వ్యవహారం వెళ్లే అవకాశం ఉండడంతో.. ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.