Balineni Srinivasa Reddy: ఇప్పుడున్న వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పగలరా..? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ల విషయంలో రోజుకోమాట మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ఇటీవల ఇళ్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసింది టీడీపీనే.. కానీ, ఇవాళ వ్యతిరేకత వస్తుందని డోర్ టు డోర్ ఇవ్వాలని చెబుతున్నారని దుయ్యబట్టారు. పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుందని రోజుకో రకంగా మాట్లాడుతున్నారు.. వాలంటీర్లు లేకుండా ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయటం సాధ్యం కాదు కదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఎందుకు పంచలేదు.. అప్పుడు వృద్దులు గుర్తుకు రాలేదా..? అని నిలదీదశారు.
Read Also: Nitish Reddy Record: ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.. నితీశ్ రెడ్డి సంచలన రికార్డు!
ఇక, చంద్రబాబు వాలంటీర్లను బెదిరిస్తున్నాడు.. మరోవైపు ప్రలోభపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని.. ఓవైపు వాలంటీర్లకు పది వేలు జీతం ఇస్తానంటున్నాడు.. మరోవైపు వైసీపీకి మద్దతుగా ఉంటే భవిష్యత్తులో మీకు ఏ ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే, మీ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఉన్న వాలంటీర్లను కంటిన్యూ చేస్తాను అని చంద్రబాబు చెప్పగలరా..? అని సవాల్ చేశారు. చంద్రబాబు బుకాయింపులు, అబద్దాలు అందరూ చూశారు.. 2014లో చంద్రబాబు చేసిన వాగ్దానాలలో ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు ప్రజలకు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.