Hyderabad: హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి 3 జేసీబీల సాయంతో నాలుగు భవనాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమతులు, సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తున్న బిల్డర్‌లకు ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Police Restrictions: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
అయినప్పటికీ.. భవనాల కట్టడాలు ఆగకపోవడంతో సోమవారం బల్దియా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చామని, త్వరలో మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.
Symptoms Of New Variant: కేంద్రం కొవిడ్ అలర్ట్ జారీ.. కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..