NTV Telugu Site icon

Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య

Balakrishna

Balakrishna

Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్‎లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఓ సినిమా కోసం తొలిసారి కలం పట్టారు బాలయ్య. రచయితగా మారి కథను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య369 సినిమా సీక్వెల్ కోసం కథను రెడి చేస్తున్నారు బాలక్రిష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య క్రియేటివిటీ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. అయితే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

Read Also: Anushka Shetty: అనుష్క అభినయంలోని మహత్తు!

ఇటీవల అన్ స్టాపబుల్ షోలో కొన్ని ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన `ఒకే ఒక జీవితం` సినిమా గురించి ప్రస్తావిస్తూ.. `ఆదిత్య 369` గుర్తొచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా `ఆదిత్య 999 మ్యాక్స్` గురించి స్పందిస్తూ.. వచ్చే ఏడాదే ప్రారంభిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. `ఆదిత్య 369`కి దర్శకత్వం వహించిన సింగీతమే ఆ బాధ్యతలు తీసుకుంటారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారు. అయితే సీనియర్ కి అవకాశం ఇవ్వడం కన్నా ఇప్పటి దర్శకులు..అందులోనూ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న దర్శకుడికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఓ సందర్భంలో అన్నారు. అయితే వచ్చే ఏడాది బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా ప్రారంభించాలి. అలాగే 109వ సినిమాకి సంబంధించి చర్చలు వేగంగా జరుగుతున్నాయి. మరి వీటన్నింటి నడుమ ఆదిత్య `999 మ్యాక్స్ నెంబర్` ఏదై ఉంటుందో వేచి చూడాలి.

Read Also: Sreemukhi: బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి.. దేవుడా హీరోయిన్లకు మించి చూపిస్తుందే

Show comments