Site icon NTV Telugu

Balavikasa IT Raids : సేవ పేరుతో కోట్లు మాయం.. అందుకే ఐటీ రైడ్స్‌

It Raids Aditya Homes

It Raids Aditya Homes

బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగా రెడ్డి శౌరెడ్డి, అయన భార్య సునీతా రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిసా కలిసి క్రింద సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల FCRA నిధులను దారిమళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్ కం ట్యాక్స్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తోంది.

Also Read : Fake Doctor: డాక్టర్‎తో డేటింగ్ అనుకుంది.. రెండేళ్ల తర్వాత తెలిసింది

హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడ లోని హైదరాబాద్ కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. పేద కుటుంబంలో పుట్టి డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన శౌరెడ్డి బాలవికాస సంస్థ ను ఏర్పాటు చేసి సేవ పేరుతో విదేశీయుల ను నమ్మించి వారి నుండి పెద్దమొత్తంలో డొనేషన్ల రూపంలో నిధులు రాబడుతూ కోట్లకు పడగనెత్తినట్లుగా ఆరోపణలున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు సంస్థ ద్వారా యాభై మిలియన్ అమెరికన్ డాల్లర్లను ( నాలుగు వందల కోట్లకు పైగా )కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎన్ని వందలకోట్లు దారి మళ్ళించాడనే విషయం తేలాల్సి ఉంది.

Also Read : Girl Was Sold For Phone : మొబైల్ కోసం అమ్మాయిని రూ.20వేలకు అమ్మేశాడు

Exit mobile version