NTV Telugu Site icon

Balakrishna: అక్కినేని తొక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉందంటూ..

Balakrishna

Balakrishna

Balakrishna: అక్కినేని తొక్కినేని మాటలపై ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుపై మాట్లాడిన మాటల గురించి ఆయన వివరించారు. యాదృశ్చికంగా అన్న మాటలే తప్ప ఆయనను కించపరచలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారన్నారు.

నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నానని బాలయ్య వెల్లడించారు. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని ఆయన తెలిపారు.

Venkatesh: పాన్‌ ఇండియా మూవీతో వస్తున్న వెంకటేశ్.. పూజతో ప్రారంభం

ఎన్టీఆర్‌ పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావుకు అందించడం జరిగిందన్నారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందన్న బాలయ్య.. బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని బాలయ్య స్పష్టం చేశారు.

Live: Balayya First Reaction On Controversy Comments On ANR and SVR | NTV Live