Balakrishna: నందమూరి బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ఉండబోతుంది అని వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా టైటిల్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహా రెడ్డి’ సినిమా బిజీలో ఉన్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేస్తున్న సినిమా ఆఖరి దశకు చేరుకుంది. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది.
Read Also: Ghantasala: మధుర గాయకుడి బయోపిక్ కు మోక్షమెప్పుడో!?
ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి – బాలకృష్ణ మూవీ పట్టాలెక్కనుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కథ ఉంటుందని ప్రచారం. బాలయ్య కూతురు పాత్రలో ఇప్పటికే శ్రీలీల ఓకే అయింది.. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే ‘రామారావుగారు’ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుంది. ఇక ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంటులోను పరశురామ్ మాటలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి.