NBK 111 : బాలయ్య కోసం గోపించంద్ మలినేని భారీ ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే మాస్ జాతర. ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న NBK111 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఒక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాలని భావించారు. అయితే, ప్రస్తుత మార్కెట్ లెక్కలు మరియు బడ్జెట్ సమీకరణాల దృష్ట్యా, ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే పక్కా “ఫ్యామిలీ ఎమోషన్స్ & పవర్ ఫుల్ యాక్షన్” కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేశారు. బాలయ్య మార్కు యాక్షన్ తో పాటు ప్రతి ఒక్కరినీ కదిలించే ఎమోషన్స్ టచ్ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
దర్శకుడు గోపీచంద్ మలినేని గత కొద్దిరోజులుగా వైజాగ్‌లో ఉండి ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ‘వన్-లైన్ ఆర్డర్’ ఫైనల్ చేయడంతో కథపై పూర్తి స్పష్టత వచ్చేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న దర్శకుడు ఈరోజే హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ బాలయ్యను కలిసి పూర్తి స్థాయి నెరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య పలు కథలు వైన్ పనిలో ఉన్నారు. ఇటీవల మళయాళ దర్శకుడు హనీఫ్ అదేని, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయా కథలు వినిపించారు. ఇక వీరసింహ రెడ్డితో మెప్పించిన గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!