Site icon NTV Telugu

Balakrishna : తెలంగాణ అభివృద్ధి ఎన్టీఆర్, చంద్రబాబులు వేసిన బీజమే

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ భవన్‌లో అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అ:శాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని, గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్లో కాస్త భయం, స్థబ్తత ఉండిందన్నారు. అక్రమ కేసులు బనాయించి బాబును అరెస్ట్ చేశారని, నోటీస్ లేకుండా రిమాండ్ తరువాత చట్టాలను యాడ్ చేశారని ఆయన మండిపడ్డారు. బాబు ద్వారా దేశం లబ్ధి పొందిందని, బాబు అరెస్టును దేశం మొత్తం ఖండిస్తుందని, ఎన్టీఆర్, చంద్రబాబు వేసిన బీజం, భిక్షమే ఇదంతా అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి ఎన్టీఆర్, చంద్రబాబులు వేసిన బీజమేనన్నారు.అరెస్ట్ అయి నెలగడుస్తున్న ఇంకా ఇక్కడా ఎవ్వరు ఖండించలేదని, ఓట్ల కోసం మూడు రోజుల నుంచి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Prema Vimanam Trailer: ఇదేదో.. విమానం సినిమాకు సీక్వెల్ లా ఉందే..?

కొందరు రాజకీయ లబ్ధి… ఎలక్షన్స్ కోసం మాత్రమే ఇప్పుడు స్పందిస్తున్నారని, తెలంగాణ పార్టీకి నేను అండగా ఉంటానన్నారు. కార్యకర్తల్లో ధైర్యం, పార్టీ బలోపేతం కోసం కంకణం కట్టుకున్నామని, రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అని, పార్టీ అనుబంధ సంస్థలను సమావేశమయ్యామన్నారు. స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని, రేపటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయన్నారు. తెలంగాణలో పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, పొత్తుల విషయం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. మేము సూచనలు చేస్తాం… బాబుకు రిపోర్ట్ అందిస్తామని, ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తామన్నారు బాలకృష్ణ. ఐటీ ఎంప్లాయీస్ అల్లాటప్పగా అల్లర్లు చేయరని, నేను ఇక్కడ ప్రచారంలో పాల్గొంటానని ఆయన తెలిపారు. బాబు అరెస్ట్ అంశంపై అక్క పురందరేశ్వరితో టచ్ లో ఉన్నాను… కేంద్ర పెద్దలను కలుస్తానన్నారు. సినిమా రంగం నుంచి ఎవరు ఖండించకపోయిన నేను పట్టించుకోనని, ( జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు ఈ విషయం లో ఎలా చూస్తారు.? ) ఐ డోంట్ కేర్…’ అని ఆయన అన్నారు.

Exit mobile version