Site icon NTV Telugu

Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్యకు మరోసారి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆదుకోవాల‌ని భార్య కన్నీరు!

Balagam Mogilaiah

Balagam Mogilaiah

Balagam Mogilaiah again seriously ill: ‘బలగం’ సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి.. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు ఈ పాటతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించేలోపు మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఓసారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయన.. మరోసారి ఆసుపత్రిలో చేరారు.

Also Read: Pawan Kalyan Win: ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది.. టాలీవుడ్ హీరోయిన్ సంబరాలు!

మొగిల‌య్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో కుటుంబసభ్యులు మంగళవారం వరంగల్‌లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆయన సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుగ్గొండికి చెందిన మొగిల‌య్యకు 67 సంవత్సరాలు. వైద్యానికి కాకావాల్సిన డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య కొముర‌మ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఆదుకోవాలని కొముర‌మ్మ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి మొగిలయ్యకు సాయం చేశారు.

Exit mobile version