Balmoor Venkat : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తక్కువ కాలంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, గతంలో బీఆర్‌ఎస్ చేయని పనులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే దీన్ని ధ్రువీకరిస్తుందని తెలిపారు.
ఇంటర్ పరీక్షల పేపర్ లీక్ నుంచి గ్రూప్-1 పరీక్షల లీక్ వరకు జరిగిన అనేక ఘటనలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వెంకట్ ఆరోపించారు. మీ హయంలో పేపర్ లీక్ జరిగితే స్పందించావా కనీసం? అని ఎమ్మెల్సీ కవితను నిలదీశారు బల్మూరి వెంకట్. పరీక్షా కేంద్రాల ఎంపికను TGPSC కాదు, కలెక్టర్లు నిర్ణయిస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేంద్రాలు పెంచుకుంటారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడకూడదు అని వ్యాఖ్యానించారు.
మాస్ కాపీయింగ్ జరిగిందని మాట్లాడడానికి సిగ్గుండాలని, వుమెన్ సెంటర్‌లో జరిగిందంటారు, అయితే మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఆధారాలు ఉంటే బయట పెట్టండి. లేకపోతే అర్థం లేకుండా మాట్లాడొద్దు అని హితవు పలికారు. కవిత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన బల్మూరి వెంకట్, మీకు, కేటీఆర్‌కి మధ్య పోటీ జరుగుతోంది.. నువ్వు నాలుగు అబద్ధాలు ఆడితే, ఆయన ఆరింటి వరకూ వెళ్తున్నారు. ఇది నిజమైన చిత్తశుద్ధి కాదు అని వెంకట్ పేర్కొన్నారు.
లిక్కర్ స్కాంలో ఇప్పటికే పరువు పోయిందని, ఇప్పుడు అబద్ధాలు చెప్పి మళ్లీ పరువు తీసుకోకు అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండి నిజాలే మాట్లాడాలి అని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు.
World Liver Day 2025: స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవల ప్రారంభం
