Site icon NTV Telugu

Bala Krishna: నేటి నుంచి మొదలు కానున్న బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’..!

2

2

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీల వారు వారి నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకెళ్తున్నారు.

Also Read: Inflation : ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం షాక్.. ఫోన్ వినియోగదారులకు భారమే

ఇందులో భాగంగా ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుండి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. ఇక ఈ ప్రచారంలో భాగంగా ‘బాలయ్య అన్‌స్టాపబుల్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు.

Also Read: Sabdham: వామ్మో.. వణికిస్తున్న శబ్దం టీజర్

ఇక ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ఏప్రిల్‌ 19న నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహించనున్నారు.

Exit mobile version