Site icon NTV Telugu

Bajireddy Govardhan Reddy : ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలి

Bajireddy

Bajireddy

ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని ఈ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌ బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు మోడీ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. ఒక ట్రైన్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోడీకి సిగ్గుండాలని, మా సీఎం కేసీఆర్ మీకు భయపడరని ఆయన అన్నారు. ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలని ఆయన ప్రశ్నించారు.

Also Read : China VS Taiwan: తైవాన్‌ను కబలించేందుకు చైనా ప్లాన్.. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లతో ముట్టడి..

కేసీఅర్ ను జైలుకు వెళ్తారు.. అన్న బండికి అయ్యింది.. ఇక గుండుకు కూడా అవుతుందని అంటూ ఆయన చురకలు అంటించారు. బీజేపీ లాంటి పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఏం చేశారని తెలంగాణకు వస్తున్నారని, బీజేపీ తెలంగాణకు వస్తే మనం కూడా ఇతర రాష్ట్రాలకు కూలీ పనులకు వెళ్ళాలని గోవర్థన్‌ రెడ్డి అన్నారు. ఏమీ చేయని మూర్ఖులు బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నారని, ఒక్క పని చేయరని, నిజామాబాద్ జిల్లాలో ఉన్న బీజేపీ ఎంపీకి 5 కోట్ల ఎంపీ నిధులు వస్తాయని, రూరల్ నియోజక వర్గంలో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన అన్నారు.

Also Read : RR vs DC: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఢిల్లీకి భారీ లక్ష్యం

Exit mobile version