Bajaj Chetak 3001: బజాజ్ ఆటో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001 (Bajaj Chetak 3001)ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 99,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ కొత్త మోడల్ పూర్తిగా కొత్త EV ఆర్కిటెక్చర్ పై రూపొందించబడింది. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001 పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దామా..
Read Also: Smriti Mandhana: ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకు.. ఐసీసీ ర్యాంకింగ్స్ ‘టాప్’ లేపిన స్మృతి మంధానా..!
చేతక్ 3001 స్కూటర్ లో ఫ్లోర్ బోర్డ్ మౌంటెడ్ 3.0 kWh బ్యాటరీ ఇవ్వబడింది. అలాగే ఈ స్కూటర్ ఒకవైపు ప్రయాణికులకు మంచి సౌలభ్యం కలిగించడమే కాకుండా, 35 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ తో మార్కెట్‌లో అత్యుత్తమ ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. చేతక్ 3001 స్కూటర్ కు 127 కి.మీ. రేంజ్ లభిస్తుంది. దీని ద్వారా రోజువారీ ప్రయాణాలే కాకుండా, చిన్న వారాంతపు ట్రిప్ లకు కూడా ఇది చక్కగా సరిపోతుంది. బజాజ్ అందిస్తున్న 750 W ఛార్జర్ ద్వారా 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని 3 గంటల 50 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఈ సెగ్మెంట్‌లో వేగంగా ఛార్జ్ అయ్యే స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది.
Read Also: Wife Kills Husband: పెళ్లయిన నెలకే భర్తకు విషం పెట్టి చంపిన భార్య..
చేతక్ 3001 కోసం బజాజ్ టెచ్ ప్యాక్ టెక్నాలజీ సూట్ అనే అదనపు ఫీచర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో కాల్ మాట్లాడడం లేదా తిరస్కరించడం, మ్యూజిక్ కంట్రోల్, గైడ్ మి హోమ్ లైట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్ విత్ లైట్, ఆటో ఫ్లాషింగ్ స్టాప్ ల్యాంప్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో ఒకేఒక్క మెటల్ బాడీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా చేతక్ 3001 నిలుస్తోంది. ఇది IP67 రేటింగ్ కలిగి ఉండడంతో ధూళి, నీటి నుండి రక్షణను అందిస్తుంది. ఇంకా వినియోగదారుల సౌలభ్యం కోసం త్వరలో అమెజాన్‌లో కూడా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకునే అవకాశం లభించనుంది.